రేపటినుండి శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్సవాలు

– 22న శ్రీ భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణంతో ఉత్సవాల ముగింపు

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా, భక్తిప్రపత్తులతో నిర్వహించే శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, ప్రసాదాలు, విద్యుత్ అలంకరణలు పూర్తయ్యా యన్నారు. అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట జగత్ప్రసూతికా అలంకారం జరిపి భక్తులకు అమ్మవారి హరిద్రా(పసుపు) దర్శనాన్ని కల్పించారు. భక్తులు సమర్పించిన 27 కిలోల స్వచ్ఛమైన హరిద్రా చూర్ణంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. జగత్ప్రసూతికా అలంకారం హరిద్రా దర్శనం నేపథ్యాన్ని ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు భక్తులకు వివరించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం భేరి పూజ, ధ్వజారోహణ, అమ్మవారికి పూర్ణాభిషేకం, కలశస్థాపనతో పరాభవ నామ సంవత్సర దేవీశరన్నవరాత్రులు ప్రారంభమవుతాయని ఈఓ సునీత తెలిపారు. అమ్మవారు ఈ తొమ్మిది రోజులు బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, లలితా మహా త్రిపుర సుందరి, భవాని మాత, సరస్వతీ మాత, భద్రకాళీ మహాదుర్గ, మహిషాసుర మర్దిని, శ్రీ భద్రకాళీ నిజరూప అలంకారములలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఈ నెల 22వ తేదీన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *