బాపూ ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో ఆయనకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఘన నివాళులర్పించారు. గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహంలను, దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం బాపూ ఘాట్‌లో డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *