Category జాతీయం

తృణమూల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

– పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజ్‌పై అత్యవసర విచారణకు నో కోల్‌కతా, జూన్‌ 30 : ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. టీఎంసీ బ్యాంక్‌ ‌ఖాతాల నిలిపివేత కారణంగా…

అసోంలో భారీ ఆపరేషన్‌

– అ‌క్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారం స్వాధీనం గౌహతి,జూన్‌ 30 :అస్సాం పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.55 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బహుశా అస్సాం పోలీస్‌ ‌చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో బంగారం సీజ్‌ ‌చేసిన…

స్కూలు బస్సుపై కూలిన చెట్టు

– 11 ఏళ్ల బాలుడు మృతి,  పలువురికి గాయాలు ముంబై, జూన్‌ 30 :‌ ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్‌ ‌బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఓ స్కూల్‌ ‌బస్సు…

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ ‌సేథ్‌

-‌బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ ‌ధీరజ్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 30: ‌భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా  ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్‌ ‌కమాండ్‌ ‌చేపట్టారు. ఆర్మోర్డ్ ‌కార్పస్  ‌విభాగం నుంచి ఆర్మీ…

అన్నాడిఎంకెలో కొనసాగుతున్న రాజీనామాలు

– కరూర్‌ ఎమ్మెల్యే విజయభాస్కర్‌ ‌రాజీనామా చెన్నై, జూన్‌ 29: ‌తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడిఎంకెకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్‌ ఎమ్మెల్యే ఎంఆర్‌ ‌విజయభాస్కర్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన…

విజయ్‌ ‌ప్రభుత్వం కూలడం ఖాయం

– అది ఎంతో దూరం లేదన్న మాజీ సీఎం స్టాలిన్‌ ‌చెన్నై, జూన్‌ 29: ‌తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ ‌తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి జోసెఫ్‌ ‌విజయ్‌ ‌నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి…

రెండేళ్లలో 500 నగరాలకు భారత్‌ ‌ట్యాక్సీ సేవలు

– గుజరాత్‌లో ట్యాక్సీ సేవలు ప్రారంభించిన అమిత్‌ ‌షా గాంధనగర్‌,‌ జూన్‌ 27: ‌రెండేళ్లల్లో 500 నగరాలకు ఈ ట్యాక్సీ సేవలు విస్తరిస్తాయని హోం మంత్రి అమిత్‌ ‌షా చెప్పారు. గుజరాత్‌లో తాజాగా భారత్‌ ‌ట్యాక్సీ సేవలను ఆయన ప్రారంభించారు. కోఆపరేటివ్‌ ‌మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ‌ప్రారంభ వేడుకల్లో హోం మంత్రి…

ఆదానీ లంచం కేసులో ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం

– కేసు ఉపసహంరణకు నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశం న్యూయార్క్,‌ జూన్‌ 27: ‌బిలియనీర్‌ ‌గౌతమ్‌ అదానీ పై నమోదైన హై-ప్రొఫైల్‌ ‌లంచం కేసులో అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్‌ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడరల్‌ ‌జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో…

అయోధ్య దొంగతనం కేసులో కీలక మలుపు!

– ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు రాజీనామా ! న్యూఢిల్లీ, జూన్ 26: సిట్ దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అయోధ్య రామ మందిర కానుకల చోరీ కేసు మరింత ముదిరింది. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనిల్ మిశ్రా కూడా తప్పుకున్నారు.…