-బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్
న్యూదిల్లీ, జూన్ 30: భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు. ఆర్మోర్డ్ కార్పస్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేథ్ రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో సైనిక సంప్రదాయాల మధ్య అధికారికంగా కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఆర్మోర్డ్ కార్పస్‌లో కమిషన్డ్ అధికారిగా జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్థానం ప్రారంభించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. సైన్యంలో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్ర కమాండ్.. రెండింటికీ ఆర్మీ కమాండర్‌గా ధీరజ్ సేథ్ వ్యవహరించారు. రక్షణ విభాగంలో ప్లానింగ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్‌లో విశేష అనుభవం.. సైన్యం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





