– కరూర్ ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా
చెన్నై, జూన్ 29: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడిఎంకెకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం విజయభాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం 41కు పడిపోయింది. రెండు వారాల క్రితం నలుగురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికార టీవీకేలో చేరారు. తాజాగా విజయ్ భాస్కర్ కూడా అదే బాటలో నడిచారు. ఆయన ఈరోజు అధికార టీవీకేలో చేరతారని వార్తలు వస్తున్నాయి. జయలలిత మంత్రివర్గంలో విజయభాస్కర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2021 ఎన్నికలలో కరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. విజయభాస్కర్ రాజీనామాతో తమిళనాడులో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో విజయ్ వదులుకున్న తిరుచ్చి స్థానం కూడా ఒకటి. ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





