Category Crime

రాష్ట్రవ్యాప్తంగా ఈగిల్‌ ‌ఫోర్స్ ‌దాడులు

– గోవా  నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ‌సరఫరా – 19మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – 14మందికి గంజాయి పాజిటివ్‌గా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌గంజాయి, డ్రగ్స్ ‌వినియోగంపై భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో ఈగల్‌ ‌ఫోర్స్ ‌పలు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ…

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం

వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో కలకలం సృష్టించింది. దిల్లీలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న వరంగల్‌ ‌కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గలో పాత పేపర్లు కొనే వ్యాపారం చేసే గంజి ఉమాశంకర్‌ ‌దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో…

నగర శివారులో డ్రగ్స్ ‌తయారీ గుట్టు రట్టు

– ముఠాను వలపన్ని పట్టుకున్న ఈగిల్‌ ‌టీమ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌  15: ‌హైదరాబాద్‌ ‌నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ డ్రగ్స్ ‌తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్‌ ‌టీం రట్టు చేసింది. సోమవారం డ్రగ్స్ ‌తయారు చేస్తున్న నరేష్‌, ‌మత్స్యగిరిలను ఈగల్‌ ‌టీం అరెస్ట్ ‌చేసింది. ఈ ముఠాలో సంతోష్‌…

షాదీ ముబారక్‌ పథకంలో అక్రమాలు

– ఆరుగురి అరెస్ట్ ‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌షాదీ ముబారక్‌ ‌పథకంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కిరణ్‌, ఇత్తేమాద్‌, అక్బర్‌, ‌ముషారఫ్‌, ‌సర్ఫరాజ్‌, ‌జఫ్ఫార్‌లు అరెస్టైన వారిలో ఉన్నారు. షాదీ ముబారక్‌ ‌పథకంలో వీరు రూ.30 లక్షల మేర…

కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌జహీరాబాద్‌ ‌మండలం హో(తి)కె డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు.. ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గర్భిణి.. దారుణమైన నిర్ణయం తీసుకుంది. రెండంతస్తుల ఇంటి పైనుంచి దూకి…

పటాన్‌చెరులో భారీ సైబర్‌ ‌మోసం

– విశ్రాంత ఉద్యోగిని భయపెట్టి రూ.58.94 లక్షల లూటీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 13 : పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత పైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. బాధితుడికి ప్రవీణ్ కుమార్, రాజేష్…

హనీట్రాప్‌లో మోసపోయిన మహిళా న్యాయమూర్తి

– పనివాళ్ల ఫిర్యాదుతో బయటపడ్డ వైనం చండీఘడ్‌,‌ జూన్‌ 12: ‌హనీట్రాప్‌ ‌లో పడి ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. అయితే దీనిపై ఆమె స్వయంగా ఫిర్యాదు చేయకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. హరియాణాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్‌ ‌యాప్‌ ‌ద్వారా అభిమన్యు…

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

– సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌…

కామారెడ్డిలో మిస్సింగ్‌ ‌కలకలం

– తల్లి, ముగ్గురు బిడ్డల అదశ్యం – గాలింపు చేపట్టిన పోలీస్‌ ‌బృందాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితోపాటు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి…