కామారెడ్డిలో మిస్సింగ్‌ ‌కలకలం

– తల్లి, ముగ్గురు బిడ్డల అదశ్యం
– గాలింపు చేపట్టిన పోలీస్‌ ‌బృందాలు

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితోపాటు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి లయ(31), కొడుకు శివ(13), ఇద్దరు కుమార్తెలు బిందు(16), దివిజ(08) ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం బయటకు వెళ్లిన నలుగురూ ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీస్‌ ‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ ‌కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్‌ ‌కాల్స్ ‌వివరాలు పరిశీలిస్తున్నారు. నలుగురూ ఒకేసారి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి మిస్సింగ్‌కు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉండ‌గా ఈ మధ్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు పంచాయితీ నిర్వహించి ఇరువురూ కలిసుండేలా ఒప్పించారు. ఇందులో భాగంగా భార్యాభర్తలు పిల్లలతో గాంధీనగర్‌లో ఉంటున్నారు. మళ్లీ గొడవలు మొదటికి రావడంతో మనస్తాపం చెందిన లయ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లయ తిరిగి రాకపోవడంతో భర్త, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *