వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 16: సాప్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో కలకలం సృష్టించింది. దిల్లీలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వరంగల్ కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గలో పాత పేపర్లు కొనే వ్యాపారం చేసే గంజి ఉమాశంకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె కీర్తన (25) దిల్లీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నది. ఇటీవల పనిభారంతో కీర్తన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిన కూతుర్ని చూసిన తల్లిదండ్రులు మూడు నెలల క్రితం వరంగల్‌కు తీసుకొచ్చారు. హనుమకొండలోని ఓ మానసిక వైద్యుడి వద్ద కొంతకాలంగా చికిత్స కూడా ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కీర్తన ఫ్యాన్‌కు ఉరేసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


