షాదీ ముబారక్‌ పథకంలో అక్రమాలు

– ఆరుగురి అరెస్ట్ ‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌షాదీ ముబారక్‌ ‌పథకంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కిరణ్‌, ఇత్తేమాద్‌, అక్బర్‌, ‌ముషారఫ్‌, ‌సర్ఫరాజ్‌, ‌జఫ్ఫార్‌లు అరెస్టైన వారిలో ఉన్నారు. షాదీ ముబారక్‌ ‌పథకంలో వీరు రూ.30 లక్షల మేర కాజేశారు. ఐదుగురు నిందితులు.. నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్‌ ‌కార్డులు సృష్టించి ఈ స్కీమ్‌కు తప్పుడు దరఖాస్తులు సమర్పించారు. ఆర్‌ఐ అశోక్‌కిరణ్‌ ‌కషన్‌ ‌తీసుకుని ఈ దరఖాస్తులను ప్రాసెస్‌ ‌చేశారు. రాజేంద్రనగర్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు ఈ అక్రమాలను గుర్తించారు. నిందితులను అత్తాపుర్‌ ‌పోలీసులకు అప్పగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *