సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 13: జహీరాబాద్ మండలం హో(తి)కె డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు.. ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గర్భిణి.. దారుణమైన నిర్ణయం తీసుకుంది. రెండంతస్తుల ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భవనం పైనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జహీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

