మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

– సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 12: ‌మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక బీదర్‌ ‌వాసులు వైజినాథ్‌, ఇం‌దుమతి దంపతులు కొన్నాళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇందుమతి బంధువు రేణుక ఈనెల జలమండలి వద్ద రెండు కేజీల మామిడి పండ్లను కొనుగోలు చేసింది. ఆ పండ్లను ఇందుమతి, ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆపై వారంతా వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతూ భువనేశ్వరి, సంధ్య మృతి చెందగా మిగిలిన వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి మామిడి పండ్లు తొందరగా మగ్గేందుకు వినియోగించే రసాయనాలు కారణమా.. లేక ఇతర పదార్థాల వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, వైద్యుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఫుడ్‌, ‌ఫ్రూట్‌ ‌నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గత నెలలో ఛత్తీస్‌గఢ్‌ ‌జాంజ్‌ ‌గిరి-చంపా జిల్లాలో పుచ్చకాయ తిని 15 ఏళ్ల బాలుడు మరణించగా, మరో ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వరుస ఘటనలతో మామిడి పండ్లు, పుచ్చకాయలు కొనాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సమగ్ర దర్యాప్తు చేపట్టామని కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *