– ముఠాను వలపన్ని పట్టుకున్న ఈగిల్ టీమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. సోమవారం డ్రగ్స్ తయారు చేస్తున్న నరేష్, మత్స్యగిరిలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో సంతోష్ సింగ్ అలియాస్ రాజు అలియాస్ రాజేష్, విజయ్, అశ్విని పాఠక్ కీలక సభ్యులుగా ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. అలాగే రూ.50 లక్షల విలువైన మెఫెడ్రోన్‌తోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకుంది. రూ.50 లక్షల విలువైన ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసింది. నరేష్, కీసర మత్స్యగిరిలు గత కొన్ని సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నారని ఈగల్ టీం వెల్లడించింది. రసాయన శాస్త్రవేత్త నుంచి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులుగా వీరు ఎదిగారని తెలిపింది. గతంలో వీరు హత్యలు, దోపిడీలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని వివరించింది. చివరకు వీరు డ్రగ్స్ తయారీదారులుగా మారారని తెలిపింది. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌లో ఈ ముఠా కీలకంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. గత ఆరు నెలలుగా వీరి కోసం గాలిస్తున్నామని చెప్పింది. 2015 నుంచి దేశవ్యాప్తంగా అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాలను ఈ ముఠా ఏర్పాటు చేసి.. తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఈగల్ టీం వివరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

