ఉనికి కోసమే బీజేపీ నాయకుల ‘రైతు భరోసా’

– ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనరో చెప్పాలి
– బీజేపీ నేతలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి

జగిత్యాల, ప్రజాతంత్ర, మే 28 : ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి గురువారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విÖడియాతో మాట్లాడారు. తాలు పేరుతో దోచుకుంటున్నామని బీజేపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి ఆలయం ముందు మాట్లాడాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సరిగా లేకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సీఎం రేవంత్‌రెడ్డితో కలసి పనిచేద్దామని అన్నారని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకు రావడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు నిధులను తీసుకురావాలని మంత్రి అడ్లూరి కోరారు. ఇదిలావుంటే ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బక్రీద్ సందర్భంగా ధర్మపురిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతీయువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో పదో తరగతి, ఇంటర్ పూర్తయిన యువతీయువకులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకు ద్వారా రూ.2 లక్షల రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసక్తి కలిగిన యువత రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగలక్క్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *