– డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ ఇళ్లు కట్టిన ఘనత మాది
– పొంగులేటి సవాల్పై కేటీఆర్ ప్రతిసవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే28: సవాళ్ళు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవా టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వోట్లు అడగదని.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ వోట్లు అడగకూడదని ఇటీవల కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ మాది. స్వరాష్ట్రాన్ని సాధించాం.. స్వగృహ స్వప్నాలను ఇందిరమ్మ ఇళ్ల సవాల్కు కట్టుబడండి
డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాం. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే వోట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? శపథం చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించాలి. 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే వోట్లు అడుగుతాం అనే సవాల్ కు కట్టుబడి ఉండాలి. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించిన ఘనత మాది. రూ.70 వేలతో మేం అగ్గిపెట్టె ఇళ్లు కట్టలేదు. మేం కట్టిన ఒక్కో ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. వీకెండ్ లో ప్రజలు ఇళ్లు కూల్చి వికృతానందం పొందుతున్నారు. రెండున్నరేళ్లలో నగరంలో కట్టిన ఇళ్లు ఎన్ని, పడగొట్టిన ఇళ్లు ఎన్ని.. దీనిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా? ఎన్ని ప్రగల్భాలు పలికినా, డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హాల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





