– చివరి ధాన్యం గింజ వరకు కొంటాం
– మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి
మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 28 తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చివరి ధాన్యం గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు. చెన్నూరు మండలం బావురావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్ల పక్రియ కొనసాగుతుందని వివరించారు. పెద్దపల్లిలో మÖడు గోడౌన్స్ అలాట్ చేశామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. హామాలీల కొరతతో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. సింగరేణి నుంచి 40 లారీలు, మైనింగ్ శాఖ నుంచి 40 లారీలను కేటాయించామని అన్నారు. మొత్తం 80 లారీలతో త్వరలోనే రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొని మిల్లులకు తరలిస్తామని మంత్రి వివేక్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





