బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ కోర్సు

 – రేప‌టినుంచి దరఖాస్తులు పంపుకోవాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం(టీజీబీసీఈఎస్‌డీటీసీ), హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షల ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర(ఈబీసీ/అనాథలు) అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కోచింగ్ 125 రోజులపాటు జరగనున్నది. ఈనెల 24న పత్రికా ప్రకటన విడుదల చేయగా 25నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం అవుతుంది. దరఖాస్తులకు ఆగస్టు 14 గడువు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 18న విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన అదే నెల 20 నుండి 24 వరకు, కోచింగ్ 25 నుంచి ప్రారంభం అవుతుంది.
అభ్యర్థుల అర్హతలు :
అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం (2026-27 ఆర్థిక సంవత్సరానికి) గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించరాదు. రెగ్యులర్ కోర్సు చదువుతున్న వారు, ఉద్యోగంలో ఉన్న వారు, గతంలో టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ పొందిన వారు అర్హులు కారు. ప్రతి నెలా 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు ఐదు నెలలపాటు నెలకు రూ.1,000 (పుస్తక నిధి, రవాణా భత్యంతో కలిపి) స్టయిఫండ్ మంజూరు చేస్తారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.  www.tgbcstudycircle.cgg.gov.in స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ కు దరఖాస్తు పంపాలి. మరిన్ని వివరాలకు టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నెం.8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్-500059, ఫోన్: 040-24071178, మొబైల్: 7780359322లో సంప్రదించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *