special Stories

special Stories

సృజన- యంత్రానిదా, మనిషిదా? -సంజయ్ ఖాన్

ప్రస్తుతం సాహిత్య ప్రపంచం రెండువర్గాలుగా చీలిపోయింది. ఒకవర్గం సృజనరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని సమర్థిస్తుంటే, మరోవర్గం దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. యంత్రానికి సృజనను అప్పగించడం అంటే, మనిషి అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది ఈ నిరసనకారుల ప్రధానవాదన. ఈ ఘర్షణకు, ప్రస్తుతం సృజనకారులు ఎదుర్కొంటున్న కొత్త అస్తిత్వ సంక్షోభానికి ఇటీవల జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.…

బూజు!-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు బూజు పట్టింది! పచ్చడికేనా?? ‘బూజు పట్టింది’ కాదు. ‘బూజు పట్టించింది’ అన్నారు, అదేదో ‘పచ్చడి పట్టించినట్టు’! అన్ని వేళ్ళూ దోషిని చేస్తూ నన్నే చూపించాయి! ‘నేను తడివి యేమీ పెట్టలేదు’ అర్థంకాక చెప్పిందే చెప్పాను. ‘నువ్వు నెలసరి అప్పుడు ముట్టి వుంటావు’ అంది మా అత్తమ్మ. ‘కోపగించుకోకు, లేకపోతే బంగారంలాంటి పచ్చడి యెందుకు…

అనునిత్యం ప్రవాహం బ. ప్రవీణ్

దోపిడిపై నీవు పాడేపాట విముక్తి భావాల ప్రతీక నీ గొంతు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నది వేలాది శ్రామికుల నిరసన గళమా ప్రజల జీవితాల్లో మమేకమైనవా మా హృదయాల్లో త్యాగమైపోయావా! అరుణోదయ నాగన్న నీ గొంతు మాట్లాడినా అది మాకు పాటగానే వినిపిస్తుంది భిన్న హావభావాల్ని అద్భుతంగా ప్రదర్శించగల కళాకారుడా! నీగొంతు ఆగిపోయిందని పాటల తల్లి.…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే…

తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.…

అవినీతికి మాగాణం అవుతున్న తెలంగాణ!

గత రెండు మూడు వారాల్లో కొందరు ప్రభుత్వాధికారుల ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో బైటపడిన నోట్ల కట్టలు, వెండి బంగారాలు, స్థిరాస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, వాహనాలు, చరాస్తుల వివరాలు చూస్తుంటే కిందిస్థాయి సగటు అధికారుల దగ్గరే ఇంతింత సంపద పోగుపడి ఉంటే, విధాన నిర్ణేతలైన, అక్రమార్జనకు నిలయాలైన ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల, మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల మీద దాడి చేసి సోదా చేయగల అవకాశమే…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

వ్యవస్థా ‘జాడ్యం’.. ఆరుగురి ప్రాణం!

ఆధునిక సమాజం సాంకేతికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, మానవీయ విలువలు, నైతికత విషయంలో తీవ్ర పతనానికి గురవుతున్నదనే సత్యాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఉదంతం మరోసారి నిరూపించింది. మానవ ప్రవర్తనలో క్రూరత్వం పెరగడానికి కేవలం వ్యక్తిగత రాక్షసత్వమే కారణం కాదు. దాని వెనుక సామాజిక, ఆర్థిక ఒత్తిడులు, వ్యవస్థాగత వైఫల్యాలు కూడా…

యుద్ధ మేఘాలు… ఎగుమతులకు సవాళ్లు

Rising Global Conflicts Pose Fresh Challenges for Exports

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ స్థిరత్వాన్ని పూర్తిగా అందుకోలేదు. కోవిడ్ అనంతర సంక్షోభాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అమెరికా సుంకాల అనిశ్చితి వంటి పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన…

నైపుణ్యత యువత విజయానికి ఆలంబన

(జూలై 15, వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా) చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేధించగలిగే నైపుణ్యం అలవడితే క్లిష్టమైన కార్యాన్ని సైతం పట్టుదలతో సాధించగలం.అసాధ్యం అనుకున్న పనిని సైతం సుసాధ్యం చేయగల ప్రతిభను “నైపుణ్యం” లేదా నేర్పరితనం అంటారు. ఇలాంటి నేర్పరితనాన్ని వర్తమాన విద్యావ్యవస్థకు అన్వయిస్తే, ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. చదువు లేకపోయినా గతంలో…