రాష్ట్రంలో యమ రంజుగా రాజకీయాలు

.”అంతేకాదు, మరో వ్యూహాం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఉప ఎన్నికల పేరుతో తగ్గించుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ సవాల్ స్వీకరించి కేసీఆర్ రాజీనామా చేస్తే, ఇటు మంత్రి సురేఖ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేస్తుంది. . సురేఖ స్థానంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య ప్రజా వ్యతిరేక వోఓట్లు చీలి బీఆర్ఎస్ కంటే పచ్చ కాంగ్రెస్ కే లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. గజ్వేల్ లో ఎలాగు కాంగ్రెస్ గెలవదు. అయితే ఈ రెండు బై పోల్ ఒకేసారి వస్తే ఒకటైనా గెలిస్తే దాన్ని రేవంత్ అవకాశంగా మార్చుకుని చూసినావా రాష్ట్రంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకోవచ్చన్న ఉద్ధేశ్యంలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది…”

కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు సర్వసాధారణ విషయం, కేబినెట్ లో విభేదాలు ముఖ్యమంత్రి సమస్య. కానీ పార్టీలో లుకలుకలు పార్టీ వైఫల్యం, మంత్రిమండలిలో గిల్లికజ్జాల సీఎం చేతగాని తనం, అసమర్థతకు నిదర్శనం.అయితే ఈ విషయాలను ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి తెరపైకి ప్రతి పక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ క్యాడర్ నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి భయం కేసీఆర్ రాజీనామా చేయాలన్న డిమాండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రతి పక్షం వారం రోజులు కార్యాచరణ ప్రకటించింది. రోజు వారీ రోడ్డు మ్యాప్ విడుదల చేసింది. ఒకవైపు అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షం దూకుడు ప్రదర్శిస్తుంది. దీంతో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కొత్త చర్చ తీసుకువచ్చారు.

దేశ రాజకీయ చరిత్రలో ఏ అధికారం పార్టీ కూడా ప్రతి పక్ష నేత రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు. సహజంగా ప్రతిపక్షం పాలనలో విఫలమైనప్పుడు మంత్రినో, ముఖ్యమంత్రినో , కేంద్రంలో అయితే ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రతి పక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వ్యక్తి ఆవేశం, ఆందోళనల, భయంతో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతాడు. ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇప్పుడు రేవంత్ పరిస్థితి అలాగే ఉంది. అర్థ దశాబ్దకాలంగా టీకాంగ్రెస్ లో నిర్మించుకున్న పచ్చ కాంగ్రెస్ కోటలు హైకమాండ్ కూల్చే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు పార్టీలో పడిపోతున్న రేవంత్ పరపతి, కేబినెట్ లో సహాచరుల తిరుగుబాటు, మరోవైపు రాష్ట్రంలో ప్రతి పక్షం దూకుడు మీదున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి విచక్షణ కోల్పోయిన ప్రతి పక్ష నేత రాజీనామా చేయాలంటున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ జరుగుతుంది.

.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేయడమంటే , ప్రతి పక్ష నేత రాజీనామాను సీఎం కోరుతున్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ముఖ్యమంత్రి అసమర్థతే. ప్రభుత్వాన్ని నడపం చేతగాదని ఒప్పుకోవడమే. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రకటిస్తే దానికి సమర్థవంతంగా కౌంటర్ చేస్తూ వెయ్యి రోజుల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమానికి చెప్పుకునేలా కార్యక్రమాలు చేయాలి. అలా కాకుండా ప్రతి పక్ష నేత రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కార్యక్రమాలు చేస్తే అది ప్రతి పక్షాన్ని బలర్చుతుంది.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని బలహీనపర్చుతుంది..అయితే కేసీఆర్ రాజీనామా చేయాలన్న రేవంత్ రెడ్డి డిమాండ్ వెనుక పొలిటికల్ వ్యూహాం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక రకమైన పొలిటికల్ అలజడిని సృష్టించి హైకమాండ్ పై ఒత్తిడి పెంచడం ఒకటైతే, రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మరొకటి. మరోవైపు ప్రజా వ్యతిరేకతను తగ్గించే ప్లాన్.

రాష్ట్రంలో ప్రతి పక్షం బల పడుతోంది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. జనాల్లో అసంతృప్తి ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారుతుంది. ఈ వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకు రేవంత్ కేసీఆర్ రాజీనామా డిమాండ్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార విపక్షాలు అభివృద్ధి సంక్షేమానికి ఓడెద్దుల్లాంటివి. రైలు పట్టాల్లా సమాన బాధ్యత వహిస్తేనే గమ్యాన్ని చేరి ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయి. ఏ ఒక్క వ్యవస్థ సరిగా పని చేయకపోయినా రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. పని చేయడం ప్రభుత్వం బాధ్యత. పోరాటాలతో సర్కారు పని చేసేలా చేయడం ప్రతి పక్షం విధి.రాష్ట్రంలో ప్రతిపక్షం తన విధిని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తుంది. ప్రజా మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అధికార పార్టీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తన బాధ్యత విస్మరించిందన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. తెలంగాణలో వెయ్యి రోజుల పాలనాపై కారు గేర్ మార్చి వారం రోజులు కార్యాచరణ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అంతర్గత కుమ్ములాటలతో కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అసలు ఇచ్చేందుకు చేసింది చెప్పుకునే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి వదులుకునే వాడు కాదు. లేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతుంది.

ఇక కేసీఆర్ రాజీనామా చేయాలన్న రేవంత్ డిమాండ్ వెనుక ఉన్న అసలు విషయానికి వద్దాం. నిజానికి ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేసే ఏ సీఎం కూడా తన పాలనలో ఉప ఎన్నికలు రావొద్దని కోరుకుంటారు. ఒకవేళ వస్తే అభివృద్ధి, సంక్షేమం అమలు జాప్యం జరుగుతుందని అనుకుంటాడు.కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజీనామా చేసి బైపోల్ రావాలని కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు కావడంలేదు కాబట్టి బై పోల్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది.

అంతేకాదు, మరో వ్యూహాం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఉప ఎన్నికల పేరుతో తగ్గించుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ సవాల్ స్వీకరించి కేసీఆర్ రాజీనామా చేస్తే, ఇటు మంత్రి సురేఖ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేస్తుంది. . సురేఖ స్థానంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య ప్రజా వ్యతిరేక వోఓట్లు చీలి బీఆర్ఎస్ కంటే పచ్చ కాంగ్రెస్ కే లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. గజ్వేల్ లో ఎలాగు కాంగ్రెస్ గెలవదు. అయితే ఈ రెండు బై పోల్ ఒకేసారి వస్తే ఒకటైనా గెలిస్తే దాన్ని రేవంత్ అవకాశంగా మార్చుకుని చూసినావా రాష్ట్రంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకోవచ్చన్న ఉద్ధేశ్యంలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

.మరోవైపు కేసీఆర్ రాజీనామా చేయాలన్న రేవంత్ డిమాండ్ పై సొంత పార్టీ నుంచే వ్యతిరేక వ్యక్తం అవుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై హైకమాండ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందట. రాష్ట్రంలో బై పోల్ ఎందుకు కోరుకుంటున్నారన్న చర్చ కూడా ఏఐసీసీ వర్గాల్లో జరుగుతుందట. సీఎం కుర్చి కింద సెగ తగుతుందని ఈ వ్యూహం అమలు చేస్తున్నారా.?.లేక మరో పార్టీని బలోపేతం కోసం చేస్తున్నారా.?.అన్న చర్చ జరుగుతోందట. కొండా సురేఖ ఇష్యూ తో పాటు రేవంత్ వ్యాఖ్యలపై ఏఐసీసీ లో సీరియస్ గా చర్చ జరుగుతోందట. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా.?. లేకపోయినా ఎందుకు దేశ రాజకీయాల్లో ప్రతి పక్ష నేతను రాజీనామా చేయాలన్న డిమాండ్ రేవంత్ ఎందుకు తెచ్చారన్న దానిపై అధిష్టానం ఆరా తీస్తుందట.

.అయితే ప్రతి ఉప ఎన్నిక ప్రభుత్వాన్ని బలపరుస్తుంది. ఆర్థిక,రాజకీయ, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ గెలుస్తుంది. అదే సమయంలో ప్రతి పక్షం గెలిచిన పెద్ద ఉపయోగం ఉండదు. రాజకీయంగా కొంత ఊపుంది తప్ప రాజకీయ సమీకరణలు మారవు. ఎప్పటిలాగే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటారు.కానీ అధికార పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి అయితే ఒకటి కాదు పది అడుగులు ముందుకేసి ప్రాపగాండా చేస్తారు. .మరోవైపు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే అందులోనూ కేసీఆర్ లాంటి నేత స్థానంలో బైపోల్ వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తారు అందులో భిన్నాభిప్రాయాలు లేదు. కానీ ప్రతి ఉప ఎన్నిక ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతను తగ్గిస్తుంది. ప్రజా వ్యతిరేకత ఎంత తగ్గితే అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెరుగు పడుతాయి.

.రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమనాటి పరిస్థితి లేదు. స్వరాష్ట్రం వచ్చింది. గతంలో లాగా రాజీనామాలు ప్రతి పక్షాలను బలోపేతం చేసే అవకాశం లేదు. ఇదే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నట్లు ఉన్నారు.అందుకే కేసీఆర్ రాజీనామా డిమాండ్ తెరపైకి తెచ్చారు. అయితే రేవంత్ ఎత్తులను బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రతి వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేసీఆర్ కు రాజీనామాలు కొత్తేమి కాదని, ఉద్యమకాలంలో అనేక సార్లు రాజీనామా చేశారని అంటూనే కేసీఆర్ ఒక్కడే రాజీనామా చేయడం ఎందుకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు పెట్టాలని ప్రతి పక్షం డిమాండ్ చేస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కున్నామా అన్నట్లు తయారైంది. రేవంత్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది.

కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం. ప్రభుత్వం, సీఎం, కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం.. అయినా ప్రతి పక్షం ఎంత బలపడితే అధికార పార్టీకి అంత బలం. అలాంటిది ప్రతిపక్షం బలహీనపడింది, ఇక లేవనే లేవదని రేవంత్ చెపుతున్న బీఆర్ఎస్ పార్టీ బలంగా దూసుకుపోతోంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది. కాంగ్రెస్ పార్టీ భయం రేవంత్ రెడ్డి మాటాల్లో కనిపిస్తుంది. ప్రతి పక్ష నేత రాజీనామా ను సీఎం డిమాండ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యానని రేవంత్ ఒప్పుకున్నట్లే అవుతుంది. కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేయడమంటే నిప్పుతో కాంగ్రెస్ గేమ్ ఆడటమే అవుతోంది.

తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *