prajatantra_news

prajatantra_news

ధర్మసాగర్‌లో దారుణం

మహిళను వివస్త్రను చేసి శిరోముండనం హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 28: హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళపై కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతోపాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం…

డీపీడీపీఎ చట్టం ప్రాథమిక హక్కులకు భంగకరం

కేంద్ర ప్రభుత్వానికి పత్రికా సంఘాలు, జర్నలిస్టుల లేఖ న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ యాక్టు-2023 (డీపీడీపీఎ -2023)లో కొన్ని నిబంధనలు తమ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా 22 పత్రికా సంఘాలు, వెయ్యికిపైగా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్‌క్లబ్‌…

సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టు

స్వేచ్ఛ మృతికి కేసీఆర్‌తోపాటు పలువురి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుల్ణగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ…

సమ సమాజానికి పునాదులు వేసిన పీవీ

పివి మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసి సమసమాజానికి పునాదులు వేసిన సంస్కర్త పి.వి.నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని పి.వి ఘాట్‌ వద్ద…

సంస్కరణల పితామహుడు పీవీ

నివాళులర్పించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు…

టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

కేటీఆర్‌ నివాళులు జర్నలిస్టు సంఘాల నాయకుల షాక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌, రచయిత్రి స్వేచ్ఛ వొటార్కర్‌ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఇటీవల ఎన్నికెనారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌసలో నివాసముంటున్న స్వేచ్ఛ…

ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం

– కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా కోసం పోరాటం – ఎత్తిపోతల పథకాలతో హుజుర్‌నగర్‌, కోదాడలు సస్యశ్యామలం – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కృష్ణా, గోదావరి జలాశయాలలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పోరాటం చేస్తుందని నీటిపారుదల శాఖ…

పీవీ.. భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: భారతరత్న పీవీ నరసింహారావు స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనాదక్షుడిగా, భారత దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది, జాతి ఔన్నత్యాన్ని…

రేవంత్‌ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం

వికలాంగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హెలెన్‌ కిల్లర్‌ 145వ జయంతి కార్యకమ్రం మలక్‌పేట్‌లోని వికలాంగుల, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ సహకార శాఖ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిది గా ఎస్‌్‌సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయోవృద్దుల, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ శాఖ మంత్రి…

నీతి ఆయోగ్‌ డెల్టా ర్యాంకింగ్‌ విడుదల 

దేశవ్యాప్తంగా గట్టు బ్లాక్‌కు 5వ స్థానం జోన్‌-3లో 2వ స్థానం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ (ఏబీపీ) 2024-25 (జనవరి-మార్చి 2025) డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్‌ దేశవ్యాప్తంగా 500బ్లాక్‌లలో 5వ స్థానం, జోన్‌ 3లో 2వ స్థానం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు,…