వికలాంగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా
మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: హెలెన్ కిల్లర్ 145వ జయంతి కార్యకమ్రం మలక్‌పేట్‌లోని వికలాంగుల, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ సహకార శాఖ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిది గా ఎస్‌్‌సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయోవృద్దుల, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి దివ్యాంగుల పార్క్‌లోని హెలెన్ కిల్లర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగు లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన వికలాంగుల బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడే ఉన్న బధిరుల స్కూల్ విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. మంత్రి స్వయంగా విద్యార్థులకి భోజనం వడ్డీంచచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తాను అట్టడుగువర్గాల నుండి, పేద కుటుంబాల నుండి వచ్చానని, సామాన్యుల బాధలు తెలుసునని, తనపౖౖె నమ్మకం ఉంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ శాఖలు కేటాయించారని, ఆయన వికలాంగుల ఆత్మబంధువు అని, ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వికలాంగుల సంక్షేమం అద్భుతంగా చేస్తానని, వికలాంగుల సంక్షేమమే ప్రధాన ద్యేయంగా, వారి ఆర్థిక అభివృద్దే మొదటి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. త్వరలోనే వికలాంగులతో ప్రత్యేక సమావేశం ఏర్పరిచి సమస్యలును పరిష్కరిస్తానన్నారు. వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యమాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే వికలాంగుల సోదరి రజినికి జాబ్ ఇచ్చి చరిత్రలోనే మొదటి వ్యక్తిగా నిలిచి చరిత్ర స`ష్టించారని, అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే 2367 స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం ఇస్తూ వికలాంగుల సమూహలను, వికలాంగుల కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిచెందడమే లక్ష్యంగా రూ.3కోట్ల 55 లక్షలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసని మొదటి మంత్రిగా చరిత్ర సృష్టించారన్నారు . వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధికి అనుక్షణం సిద్దంగా ఉన్నామని, ఇప్పటికే కొత్త ప్రభుత్వంలో వికలాంగుల సంక్షేమానికి అనేక నూతన జీవోవోలు తెచ్చామని తెలియజేశారు. కార్యక్రమంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు దాదాపు 1500మంది వికలాంగులతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని వికలాంగుల సంఘాల నాయకులు, మలక్‌పేట్ ఎమ్మెల్యే అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీవిద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరచేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాజెక్టును చేపట్టింటని,. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కేంద్ర మంత్రి రాందాస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గాల అభివృద్ధికి రూ.232.68 కోట్లు పీసీఆర్/పీవోఏ పథకం కింద), రూ.36.13 కోట్లు పీఎంఏజేఏవై పథకం కింద) మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని కోరారు. దీని ద్వారా సామాజిక న్యాయం, సాధికారత, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు తెలంగాణ చేరువ కానుందని మంత్రి తెలిపారు.