ధర్మసాగర్‌లో దారుణం

మహిళను వివస్త్రను చేసి శిరోముండనం

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 28: హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళపై కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతోపాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం చిక్కుడు రాజు అనే వ్యక్తికి, బాధితురాలికి శిరోముండనం చేయించారు. రాజు భార్య గంగ, ఆమె తరపు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. పలుమార్లు పంచాయితీలు పెట్టి హెచ్చరించినా ఇరువురి తీరూ మారకపోవడంతో ఇలా చేశామని అంటున్నారు. దీనిపౖౖె పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page