మ‌హిసాసుర‌మ‌ర్దినిగా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు

నేడు అమ్మ‌వారికి తెప్పోత్స‌వం
వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: వరంగల్ లోని ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్ర‌వారం ఉదయం 4 గంట‌లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చ‌కులు అమ్మ‌వారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజ‌లు చేశారు. అలాగే వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గ క్రమంలో భోధయనోక్త నవరాత్ర కల్పాన్ననుసరించి శుంభహా దుర్గా క్రమంలోను అమ్మవారికి  పూజ‌లు నిర్వ‌హించారు. ఉదయం అమ్మవారికి చతురన్త సేవ, సాయంకాలం సర్వభూపాల వాహన సేవల‌ను  అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.  సర్వభూపాల వాహన సేవలో అమ్మ‌వారిని దర్శించడం వల్ల సర్వతోముఖవిజయ ప్రాప్తి కలుగుతుంది.  మధ్యాహ్నం గంటలు 03-00లకు నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వ‌హించారు.
కార్యక్రమంలో అనేకమంధి భక్తులు పాల్గొన్నారు.శ‌నివారం అమ్మవారికి ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రస్నానం అనంతరం ధ్వ‌జారోహణం తదుపరి తెప్పోత్సవం నిర్వహించనున్న‌ట్లు అర్చ‌కులు తెలిపారుఈ రోజు కార్యక్రమాలకు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ – రేవతి దంపతులు, పింగిలి సంపత్ రెడ్డి- సునీత దంపతులు, నాగపూరి అశోక్ కుమార్- సరిత దంపతులు, తిక్కవరపు కేశవ రెడ్డి – మంజుల దంపతులు, అభిరామ్ రెడ్డి, సింధూర, కటకం సత్యనారాయణ- రంగమణి దంపతులు, కటకం సాయి నీలేష్,  కీర్తి శ్రీ దంపతులు, రంగయ్య తదితరులు ఉభయ దాతలుగా వ్యవహరించారు.  ఉబయ దాతలకు పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదాలు ఆందజేశారు.అలాగే రోజు అమ్మవారిని ఐఏఎస్ అధికారి ఆమేయ్  కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా సాయంకాలం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *