ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ఏసీపీ జితేందర్ రెడ్డి

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 25 :   వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి (Warangal police commissionerate ) లో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని జాతీయ ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్టరల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు ను ఏసీపీ అందుకున్నారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఏసీపీకి అభిందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page