16న బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్పాన్సర్డ్ సీట్ల కౌన్సెలింగ్
– ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారందరూ ఉదయం 9.30 వరకు హాజరు కావాలి
– విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు లో 60స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశానికి ఈనెల16న కౌన్సెలింగ్ ఉంటుందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, పూర్తి వివరాలు https://mjptbcwreis.telangana.gov.in లో ఉన్నాయని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాటర్ మెనేజ్‌మెంట్ యూనిట్, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆడిటోరియం, అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్, రాజేంద్రనగర్ లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈనెల 16న ఉదయం 9.30 గంటల వరకు కౌన్సెలింగ్ సెంటర్ కు చేరుకోవాలని, అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ తీసుకుని రావాలని ఆయన సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


