హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని బిఆర్కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై వారు చర్చించారు.
కాగా ఐ అండ్ పీఆర్‌కు ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న ఎం.హనుమంతరావును యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించడంతో ఆ స్థానంలోకి రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న హరీశ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హరీశ్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.





