దిల్లీ తదుపరి సిఎం అతిశి

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌
దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌ ప్రకటించారు. సిఎంగా ఆతిషి బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజీవ్రాల్‌ చర్చించారు. అనంతరం శాసనసభా పక్ష సమావేశంలో మంత్రి అతిషి పేరును ప్రతిపాదించారు కేజీవ్రాల్‌.

ఈ ప్రతిపాదనకు శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది..  కేజీవ్రాల్‌ రాజీనామాను ఎల్జీ ఆమోదించిన తర్వాత.. కొత్త సీఎంగా ఆతిశీ పేరును ఆప్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సెప్టెంబరు 26,27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి . ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దిల్లీ అసెంబ్లీకి వొచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

అయితే నవంబరులోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజీవ్రాల్‌ డిమాండు చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ముందస్తుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.కాగా, మద్యం పాలసీ కేసులో కేజీవ్రాల్‌ ఇటీవలే బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే, బెయిల్‌ మంజూరు చేస్తూ.. సిఎం కార్యాలయానికి వెళ్లకూడదని, అధికారిక ఫైల్స్ పై  ్గసంతకం చేయకూడదని కేజీవ్రాల్‌ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో కేజీవ్రాల్‌ సిఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *