భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 03 : అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండికుండల మారి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో  నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతు మంగళవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా సాయంత్రానికి 40 అడుగులకు చేరింది.

ఇది క్రమంగా మరో 5 అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత పెరిగినప్పటికి వరదలను ఎదుక్కోనేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే బారీ వర్షాలతో అతలాకుతలం గోదావరి పరివాహక ప్రాంతాలు మళ్ళి గోదావరి వరద రావడంతో ప్రజలు మరింత భయాంధోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు వేసిన పంట పొలాలు , చెట్లు పాడయ్యాయి. వరద ప్రభావంతో మరింత పంట పొలాలు పాడయ్యే అవకాశం ఉన్నందున రైతులు తీవ్రంగా భయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *