‌విద్యారంగ ప్రాధాన్యతను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తీవ్ర నిర్లక్షానికి గురైన విద్యారంగం,నూతన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో నైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే బడ్జెట్‌లో కేవలం 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశను కలిగించిందని డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా మేధావులు,విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర బడ్జెట్‌ ‌లో విద్యారంగానికి 20%తగ్గకుండా నిధులు కేటాయించాలని పదే పదే కోరుతున్నప్పటికీ అట్టి విజ్ఞప్తిని పట్టించు కోలేదన్నారు.

తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రజల బిడ్డలందరికీ నాణ్యమైన సమానమైన విద్య అందించడం సాధ్యం కాదు అన్న విషయం పాలకులకు తెలియంది కాదు.అయినను దశాబ్దాలుగా విద్యారంగానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకపోవడం ద్వారా పేదలకు, బలహీనవర్గాలకు ఉద్దేశ్య పూర్వకంగా అన్యాయం చేసినట్లే అన్నారు. గత పాలకుల వలెనే ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్లడం బాధాకరమని డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *