మారుతున్న సామాజిక విలువల్లో ఉపాధ్యాయుడి పాత్ర….!!!

సెప్టెంబర్ నెలలో భారత రాష్ట్రపతిగా మంచి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్నించడం క్యాలెండర్లో సెప్టెంబర్ నెలకు ఒక ప్రాధాన్యత వున్నది ప్రజలను ఉన్నతంగా భావించే సమాజంలో ఉపాధ్యాయుడు లేకుండా సమాజం సక్రమంగా తీర్చిదిద్దబడదనీ అదే విధంగా సమాజాన్ని దేవాలయంగా గురువులనే పూజిరి లేకుండా విద్యార్థికి సమాజానికి సంబంధము లేదని చెబుతుంటారు దీనిలో భాగంగానే గురువును బ్రహ్మగా సంబోధిస్తారు సెప్టెంబరు ఐదున జన్మించిన భారతీయ మేధావిగా తత్వవేత్తగా చెప్పుకునే డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని గురుపూజోత్సవంగా లేదా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అనుకోవడం అందుకు ఉపాధ్యాయులు గర్వపడడం సెప్టెంబర్ నెలకు ప్రాధాన్యత పెరగటం సహజమే

సమాజం ఉపాధ్యాయుల నుండి చాల ఆశిస్తుంది ఉపాధ్యాయులు డా|| సర్వేపల్లి రాధాకృష్ణ లేదా అబ్దుల్ కలామ్, రామకృష్ణ పరమ హంసలాగ వుండాలని కోరుకో వడంలో తప్ప లేదు ఉపాధ్యాయలు విలువలతో కూడుకున్న మార్గదర్శకులుగా వుండాలి కూడ అలాంటి వారితో పోల్చుకుని నేడున్న ఉపాధ్యాయులు నిబద్దత లేని వారుగా విద్యారంగాన్ని దిగజార్చుతున్నారనో ముఖ్యంగా సర్కార్ పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు చదువు రావడంలేదనే దీనికంతటకు ఉపాధ్యాయుడే కారణమనీ అనేక ప్రశ్నలను ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు విద్యారంగంలో వస్తున్న మార్పులకు ఉపాధ్యాయులు జవాబుదారీగా మారుతున్నాడు కాని జరుగుతున్న దేమిటి ? తల్లిదండ్రులు సమాజం మేధావులు విద్యారంగంలో వస్తున్న మార్పులు పరిశీలిస్తున్నారా? సంస్కరణల పేరుతో విద్యారంగంలో తప్పంతా  ఉపాధ్యాయుల దేనని గోచరిస్తుందిభారతదేశ స్వాతంత్ర్యం  కన్నా ముందు తదుపరి దేశంలో విద్యా విధానం ఎలా వుండాలి? అని ప్రభుత్వాలు అనేక కమీషన్లు వేశాయి డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ డా|| కొఠారి వంటి మేధావులు మన దేశంలో విద్యా విధానం ఎలా వుండాలి అనడానికి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా చాలా చక్కటి సూచనలు చేసినారు ఆ రిపోర్టులను పార్లమెంటులో చర్చించారు.

 

అమలుకు మాత్రం నోచుకోలేదు భారతదేశం విభిన్న సంస్కృతులు భాషాలు సాంఘిక అంతరాలు ఆర్థిక అసమానతలు ప్రజల మధ్య అనేక వివక్షతలు వున్న దేశం విద్య ద్వారా జాతీయ సమైక్యత వివక్ష సాంఘిక ఆర్థిక అసమానతలు లేని నూతన సమాజ స్థాపన జరగాలంటే విద్యనే సరియైన సాధనమని విద్యాకు పాఠశాల పునాది అవుతుందని అందరికి ఒకే విధామైన పాఠశాల వ్యవస్థ వుండాలనీ కామన్ స్కూల్ విధానం ఆ స్కూల్లను కూడా ప్రభుత్వమై నిర్వహించాలని సూచించడం జరిగింది కాని పాలకులు ఈ సూచనలను అమలు చేయడంమరిచినారు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు కావచ్చు పాలకులు దేశాన్ని 21వ శతాబ్దానికి తీసుకెళ్తున్నామని 1986లో నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగంలో అనేక మార్పులు చేశారు అప్పటి వరకు విద్యారంగంలో వున్న సమస్యలను చర్చకుతెస్తూనే  కామన్ స్కూలు విధానాన్ని విద్వంసం చేస్తూ వ్యాపార విధానాలు ప్రోత్సహిస్తూ విద్యను సరుకుగా మార్చారు దీనితో వివక్షలు అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి వుపయోగపడవలసిన విద్య నేడు అనేక అసమానతలు సృష్టించేదిగా మారింది గురు శిష్యుల సంబంధంతోపాటు పాఠశాల సమాజం సంబంధాలు కూడా వ్యాపార సంబంధాలుగా మారినాయి విద్యను పొందే హక్కును నేడు డబ్బే శాసిస్తుంన్నది.

ప్రపంచీకరణ విధానాలను అవలంబిస్తున్న మన పాలకులు ఇంకోక అడుగు ముందుకు పోయి విద్యను కార్పొరేకరణ దిశగా నడిపిస్తూన్నారు విద్యారంగంలో వ్యాపార విలువలు ముందుకు తీసుకుపోతూ ఆదాని అంబానీలతో కమిటీలు వేసి వారి సూచన మేరకు విద్యా రంగంలో సంస్కరణలకు వూనుకోవడం విదేశీ విద్యాలయాలకు అనుమతులు ఇవ్వడం కోసం పార్లమెంటులో చట్టాలు చేస్తున్నారు ఉపాధ్యాయులు అందరూ  సర్వేపల్లి రాధాకృష్ణన్ లుగా వుండాలని కోరుకునే వారు ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి నేటి ఆర్థిక స్థితిగతి ఏమిటి? నేటీ స్థీతిగతులు ఏమిటీ? అని బేరిజు వేసుకోకుండా వస్తుగతంగా చూస్తే ఉపాధ్యాయుడు దోసిగా కన్పించవచ్చు దీని వలన ఫలితంకూడా వుండదు సమాజంలో వ్యాపార విలువలు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో ఆ సమాజంలో నివసించే వ్యక్తిగా ఉపాధ్యాయుడు ఒక్కడే  ఆ విలువలకు వ్యతిరేకంగా నిలబడడం కష్టం. విద్యను కార్పొరేటీకరిస్తున్న శక్తులు డిజిటల్ స్కూల్స్ పేరుతో షార్ట్ సర్క్యూట్  కెమెరాతో డేగ కండ్లతో సరాసర తరగతిగదిలో శాసిస్తున్నారు స్వేచ్ఛగా భావ ప్రకటన చేయాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో బందీగా నిలబడినప్పుడు తరగతి గదికి ఉపాధ్యాయుడికి మధ్య సాంకేతిక సంబంధం మాత్రమే వుంటుంది అలాంటి చోట గురు  శిష్యుల సంబంధం ఎలా వుంటుందో ఆలోచించాలి.

 

పరీక్ష ఫలితాలు ర్యాంకులు, సీట్లు, ప్రచారం చేసుకుని మార్కెట్ ను విస్తరించుకుటున్న కార్పొరేట్ ఆక్టోపస్ లు ప్రభుత్వ విద్య వ్యవస్థను మింగేస్తున్న రోజులలో సమాజానికి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుడికి విద్యార్థుకి సంబందం ఏ విధంగా వుండాలని ఆశిద్దాం ?! ఏ సమాజంలోనైనా మానవ సంబంధాలు ఆనాటి సామాజిక ఆర్థిక సంబంధాల పైననే ఆధారపడి వుంటాయి అయినప్పటికీ ఉపాధ్యాయుడు విలువలతో సామాజిక బాధ్యత విస్తరించరాదని సమాజం భావించవచ్చు ఉపాధ్యాయులు ఒంటరిగా ఈ మార్పులు అపగలరా? సమాజం విద్యార్థుల తల్లిదండ్రులు వున్నవ్యవస్థలో మా పిల్లలకు ఏ లాభం జరుగుతుందనే బావన కాంకుండా అందరి పిల్లలకు అవసరమైన విద్య వ్యవస్థను మానవ విలువలను పెంపొందించే సమాజాన్ని నిర్మించడానికిఉపాధ్యాయుడి పాత్రముఖ్యమని గుర్తించాల్సిన ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇయ్యాల్సినటువంటి  ప్రమోషన్లు ప్రభుత్వం

ఇచ్చి ఉపాధ్యాయులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశంలో పెట్టడం ఎంతో చరిత్ర కలిగి నటువంటి ఉపాధ్యాయ సంఘాల సమావేశానికి పోవటం ప్రభుత్వంతో చట్టాపట్టాలేసుకొని భాగస్వామ్య అవకాశాలను భాగం బాగా బలుసుకున్న ఉపాధ్యాయ సంఘాలకి మెడపైన తలకాయన్న ఉపాధ్యాయులు విద్యాశాఖదికార్లు విద్యారంగాభివృద్ధిని కాంక్షించే మేధావులు యిప్పటికైనామేల్కొంటేఈరంగంరక్షించబడుతుందిఈ విషయంగా ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించటం ఎంతైనా అవసరం

శోభ రమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656327.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *