మహిళా భద్రత విభాగం డీజీగా డాక్టర్ సౌమ్య మిశ్రా

– చారు సిన్హా నుంచి బాధ్యతల స్వీకర‌ణ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 16: తెలంగాణ మహిళా భద్రత విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా డాక్టర్ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్న మహిళా భద్రత విభాగం కార్యాలయంలో ప్రస్తుత డీజీ చారు సిన్హా నుంచి ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అయిన డాక్టర్ సౌమ్య మిశ్రా మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సాధికారతకు సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, బాధితులకు రక్షణ కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై మహిళా భద్రత విభాగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రజలకు చేరువగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, సంబంధిత సంస్థల సమన్వయంతో మహిళల భద్రతకు చర్యలు చేపడుతోంది. మహిళలు, చిన్నారులకు సురక్షితమైన, సమానత్వంతో కూడిన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేస్తోంది. లింగ వివక్ష, మహిళలపై హింస వంటి సమస్యల నివారణకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక బాధ్యత, లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది. డాక్టర్ సౌమ్య నాయకత్వంలో ఇప్పటికే అమలవుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజల్లోకి భద్రతా కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు మహిళా భద్రత విభాగం కృషి చేయనుంది. మహిళలు, చిన్నారులు గౌరవంగా, భద్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజ నిర్మాణానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *