రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
రాష్ట్ర సాధన పోరాటంలో క్రియాశీలక పాత్ర : జిట్టా మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్ సంతాపం
తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్బ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.