మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది…తప్పిన ముప్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ మొదటి అంతస్తు ల్యాబ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో హాస్పిటల్ లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. జరిగినది స్వల్ప అగ్ని ప్రమాదమేనని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి వెల్లడిరచారు. మొదటి అంతస్తులో ల్యాబ్ లోని ఫ్రిడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని తెలిపారు. ఫ్రిడ్జ్ దగ్గరలో ఉన్న రబ్బరు పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చిందన్నారు. దీంతో పేషంట్స్ అటెండర్స్ కొంత భయాందోళనకు గురయ్యారన్నారు.
వెంటనే తమ సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారని ఉషారాణి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ పై ట్రైన్ అయ్యి ఉండడం వల్ల వెంటనే మంటలు ఆర్పివేశారు అని ఉషారాణి వెల్లడించారు.