అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

-మంత్రి పొంగులేటి

కల్లూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

హనుమత్ నామస్మరణతో పులకించిన మంత్రి నివాసం

ఆధ్యాత్మిక పరిమళాల మధ్య కల్లూరు మండలం నారాయణపురం గ్రామం పులకించిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగృహంలో హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా సాగింది. మంత్రి పొంగులేటి, ఆయన సతీమణి మాధురి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాతృమూర్తి పొంగులేటి స్వరాజ్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీలక్ష్మి రెడ్డి దంపతులు భక్తితో పారాయణం చేశారు. కుటుంబ సభ్యులందరూ ఏకమై సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాకుండా లోక కళ్యాణార్థం, రాష్ట్ర ప్రజలందరి క్షేమం కోరుతూ ఈ పారాయణాన్ని నిర్వహించారు. ‘రామదూత’ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *