మహిళా బిల్లు ఎన్నికల డ్రామా

– బీజేపీపై మంత్రి సీతక్క విమర్శలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్యాంకు బండ్‌పై ఉన్న అంబేడ్కర్ భారీ విగ్రహం వద్ద మంగళవారం ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా బిల్లు గురించి ఈరోజు తామేదో కొత్తగా చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారని ఆమె విమర్శించారు. అసలు బీజేపీలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక్క మహిళా అయినా ఆ పార్టీకి అధ్యక్షురాలు అయ్యిందా అంటూ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని నిలదీశారు. ఇపుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకుని ఎన్నికల సమయంలో ఒక డ్రామాకి తెరతీశారని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ కోట ఉండాల్సిందేనన్నారు. డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు లింకు పెట్టి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి.. అందులో బీసీలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి అనేది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు ప్రజా భవన్‌లో అంబేడ్కర్ చిత్ర పటం వద్ద మంత్రి సీతక్క ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *