సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి శ్రమ కావ్యం గురించి తిరుమలగిరి శ్రీనివాస్ రాసిన వ్యాసం ఆ కావ్యాన్ని ఆ కావ్యంలోని అద్భుత భావాన్ని సంపూర్ణంగా ఆవిష్కరి ంచింది. ఎవరు చూడని అర్థం కాని దైవభావాన్ని దాన్ని చుట్టూ అల్లినటువంటి దోపక రూపాలైన టువంటి మతాలు, మత చాందసాలు మత ఆచారాలు అన్నింటిని, వాటి వికృత విరాట్ రూపంను బహిష్కరించి దాని స్థానంలో శ్రమే దేవుడు, శ్రమే మతం, శ్రమే సత్యం అనేటువంటి శ్రమ కావ్యం రాసినటువంటి సుద్దాల తేజ సదాభి నందనీయులు. శ్రమకు పట్టం కట్టి, భౌతిక హేతువాదాల మేటిగా ఘాటుగా తెలుగులో రాసిన మొట్టమొదటి కావ్య మీదే అయి ఉంటుంది.
ఎవరు చూడని, ఎవరికీ తెలియని, ఎవరి అనుభవన్లోకి రాని ఆత్మ చుట్టూ రకరకాల ఊహాగానాలు చేసి మానవ జీవితాన్ని శ్రమ నుండి దూరం చేసి, శ్రమ ఎన్నడు చేయని వాళ్లంతా చేసిన ఘోరాల్ని ఈ కావ్యంతో ఎత్తి మోత్తి చూపాడు. ఇలాంటి కావ్యాలు సరళ వ్యాఖ్యానాలతో పాఠ్యాంశాలుగా మారాలి. మత ప్రచారాలకు వాడేటువంటి గుళ్ళు గోపురాలు, చర్చిలు మాస్కులు, గురుద్వారాలు అన్నీ కూడా శ్రమతోనే నిర్మించబడ్డాయనే సత్యం, ఆలోచన అనే శ్రమతోని ఆలోచించే ఎవరికైనా ఈ కావ్య ప్రాశస్త్యం అర్థమవుతుంది.
– డా।। మండువ ప్రసాద్ రావు, 9963013078
కెపిహెచ్బి కాలనీ సిక్సత్ పేస్ ఫ్లాట్ నెంబర్ 402 శ్రీరంగ విహార అపార్ట్మెంట్స్ హైదరాబాద్