– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం
ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి చేరిన విషయం తెలిసిందే. మంగళవారం గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్థులు, పాత మిత్రులు ఘన స్వాగతం పలికారు. పీపుల్స్‌వార్ గ్రూప్ కాలంలో కాల్వపల్లి ఆయన ఉద్యమ ప్రస్థానానికి కీలక కేంద్రంగా నిలిచిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఇక్కడినుంచే ఆయన తన కార్యకలాపాలను ప్రారంభించి, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, పాత స్నేహితులతో ముచ్చటించిన ఆయన ముందుగా తన తల్లి బతుకమ్మను కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దామోదర్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




