కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బీఆర్ఎస్‌ కు బూస్ట్ .!!

 “ఘోష్‌ కమిషన్‌ నివేదికను హై కోర్ట్‌ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు, రేవంత్‌ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్‌ బూస్ట్‌ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన పొలిటికల్ డ్రామాలకు ఇక తెర పడ్డట్లే..” 
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి..రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత వేగంగా బలమైన శక్తిగా ఎదిగిందో సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వం తీరుతో అంతే వేగంగా పతనం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన ప్రజలే ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్ల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌, ఆ పార్టీలో కలిసి కొంత మంది చేసిన తప్పుడు ప్రచారం ప్రధాన కారణం..బీఆర్ఎస్‌ ఓడిపోవడంతో అనేక కారణాలున్నప్పటికీ, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారమే ప్రధాన కారణం.
.కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ విష ప్రచారం చేసింది..ఎన్నికల్లో ప్రధాన విమర్శనాస్త్రంగా మార్చుకుంది..అయితే రేవంత్‌ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ చేరి టీపీసీసీ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరింత దుమ్మెత్తి పోశారు..అయితే రేవంత్ విమర్శల వెనుక తన గురువు ప్రయోజనాలున్నది కూడా ఒక కారణం..
 కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత  కాళేశ్వరంను రేవంత్‌ వ్యక్తిగత ఎజెండా మార్చుకున్నారు..కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణకు బీఆర్ఎస్‌ పార్టీకి ఎంతో పేరు తీసుకువచ్చింది. కేసీఆర్‌ను అపర భగీరథుడిగా తెలంగాణ ప్రజలు గుర్తించారు.అయితే కేసీఆర్‌కు వచ్చిన ఇమేజ్‌ను రేవంత్‌ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు..
సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డలో రెండు పియర్లు కూలిపోవడంతో దాన్ని రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ అవకాశంగా మార్చుకుంది..రేవంత్‌, బీజేపీ, చంద్రబాబు ముగ్గురి ఎజెండా కేసీఆర్‌ను ఓడించడమే కాబట్టి కలిసి పని చేశాయి..అయితే మేడిగడ్డ పియర్లను బాంబులతో పేల్చారన్న కేసు కూడా నమోదైంది..
.ఎన్నికల ముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విషం చిమ్మడమే ఎజెండా పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి..ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కేసీఆర్‌కు ,బీఆర్ఎస్‌ పార్టీకి మంచి పేరు వచ్చిందో అదే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ లో రెండు పిల్లర్లు కుంగడాన్ని అనుకూలంగా మార్చుకున్న రేవంత్‌ రెడ్డి..పవర్‌లోకి వచ్చిన తర్వాత అదే విషం చిమ్మడంతో పాటు విచారణ పేరుతో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి కేసీఆర్‌ను హరీష్‌ రావును వేధించే కుట్రలు చేసింది..కాళేశ్వరం కూలేశ్వరమంటూ ప్రచారం చేస్తూ రెండున్నరేళ్లగా రాజకీయాలు చేస్తున్నారు.
కేసీఆర్‌ను వేధించేందుకు జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ను రేవంత్‌ రెడ్డి ఆయుధంగా వాడుకున్నారు.. ఘోష్‌ కమిషన్ దాదాపు 20 నెలలు విచారణ చేసింది..అనేక మందికి సాక్షులుగా పిలిపిచింది..అందులో భాగంగా కేసీఆర్‌, హరీష్‌ రావు సహా గత ప్రభుత్వంలోని అధికారులను కూడా విచారించింది..అయితే జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ మొదట్లో చట్ట ప్రకారం నిజాయితీగా విచారణ చేపట్టిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓత్తిడితో, విచారణను ప్రభావితం చేసేలా అరోపణలు చేస్తూ రిపోర్ట్‌ మారేలా ప్రకటనలు చేశారు..జస్టిస్‌ ఘోష్ నివేదిక ఇచ్చేందుకు సిద్దమైన ప్రతీసారి రేవంత్‌ రెడ్డి ఏవో కొత్త ఆరోపణలు చేస్తూ ,కొత్త లీక్‌లు ఇస్తూ కమిషన్‌ కాలపరమితి పెంచుతూ జస్టిస్ ఘోష్‌ నివేదికను ప్రభావితం చేశారన్నది ఓపెన్‌ సీక్రేట్‌.
అయితే బీఆర్ఎస్‌ పార్టీని బద్నాం చేసేందుకు, కేసీఆర్‌ను హరీష్‌ రావును వేధింపులతో ఇబ్బంది పెట్టాలన్న రేవంత్‌ రెడ్డి అనుకుంటే, కేసీఆర్‌, హరీష్ రావులు బాధ్యతల వ్యక్తులుగా సహకరించారు..విచారణకు హజరయ్యారు..కమిషన్‌కు పూర్తి సమచారం ఇచ్చారు..కానీ కమిషన్‌ ఏర్పాటు చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వమే కమిషన్‌ను సహకరించలేదు..కమిషన్‌ అడిగిన వివరాలు, కేబినెట్‌ మినిట్స్ ఇవ్వకుండా కుట్రలు చేసింది..కమిషన్‌ కాలపరిమితి పెంచుతు రాజకీయ లబ్దిపొందాలని కాంగ్రెస్ చూసింది.
కాళేశ్వరంపై విచారణ రేవంత్‌ రెడ్డి పర్సనల్‌గా తీకున్నారు.తన ప్రతీకార రాజకీయాలే కాకుండా, గురువు ఆకాంక్షలకు అనుకూలంగా పని చేశారు..రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించారు..కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కూడా కేసీఆర్ ఆనవాళ్లు కావడంతో దాన్ని బద్నం చేసే ఎజెండాను ముందేసున్నారు..కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు చేశారు..రెండున్నరేళ్ల నుంచి మేడిగడ్డను రిపీర్‌ చేయకుండా కుట్రలు చేశారు..కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయిందని విషం చిమ్మారు..కేంద్ర మంత్రి చేత పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా సీబీఐ విచారణకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసింది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ఉద్దేశ్యంతో కుట్రతో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ వేసిందని, అయిన కమిషన్‌కు సహకరిచామని బీఆర్ఎస్‌ పార్టీ ప్రకటించింది..కేసీఆర్‌ హరీష్‌ రావు విచారణకు హజరయ్యారు..అయితే విచారణ కమిషన్‌ చట్టాని భిన్నంగా కాంగ్రెస్‌ పార్టీ సూచనల మేరకే జరుగుతుందని మొదటి నుంచి బీఆర్ఎస్‌ విమర్శిస్తు వచ్చింది..అన్నట్లు ఫైనల్ రిపోర్ట్‌లో ఘోష్ కమిషన్‌ చట్టానికి విరుద్దంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, చట్ట ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తుది నివేదిక ఇచ్చే ముందు కమిషన్‌ చట్టంలో సెక్షన్‌ 8 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే ఫైలన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం ఒత్తిడితో  ఘోష్‌ కమిషన్‌ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్‌ ఘోష్‌ నివేదికపై హైకోర్ట్‌ను ఆశ్రయించింది.
విచారణ చేపట్టిన హైకోర్ట్ ఏప్రిల్‌ 22న తుది తీర్పువెల్లడించింది..హరీష్‌ రావు, కేసీఆర్‌ వాదనలు విన్న న్యాయ స్థానం కమిషన్‌ నివేదినకు తప్పుబట్టింది..వెంటనే నిలిపివేస్తు ఆదేశాలిచ్చింది. కమిషన్‌ ఏర్పాటును సమర్థించిన కోర్ట్‌, కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొవద్దని ఆదేశాలు జారీ చేసింది..దీంతో కాంగ్రెస్‌ బీజేపీ రాజకీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్‌ పార్టీపై కేసీఆర్‌పై వ్యతిరేకతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విషం చిమ్మిన వారికి హైకోర్ట్ తీర్పు చెప్పదెబ్బలాంటిదే.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రమే ఉంది..ప్రజా మద్దతు కోల్పొయింది..ఇప్పుడు ములిగే నక్కపై తాటిపండు పడ్టట్లు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అటు ప్రజా క్షేత్రంలో ఇటు న్యాయ స్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి..నిన్నటి దాకా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కూలిపోయిందని..లక్ష కోట్లు వృధా అయ్యాంటూ విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డి రెండున్నరేళ్ల తర్వాత  మేడిగడ్డకు పోయి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రిపేర్‌ చేస్తామని ప్రకటించారు..వాస్తవానికి మొదటి నుంచి మేడిగడ్డను రిపేర్‌ చేయాలని బీఆర్ఎస్‌ డిమాండ్ చేస్తుంది.
తక్కువ ఖర్చుతోనే రిపేర్‌ చేయోచ్చని, నిర్మాణ సంస్థనే రీపేర్‌ చేసేందుకు ముందుకు వస్తుందని చెప్పినా, కేవలం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని, రాజకీయ కక్షతో, తెలంగాణ నీటి హక్కులు ఏపీకి ధారదత్తం చేసేందుకు రేవంత్‌ రెడ్డి మేడిగడ్డపై కుట్ర పూరితంగా వ్యవహరించారు. ఇప్పుడు హైకోర్ట్‌ తీర్పుతో రేవంత్‌ రెడ్డి కుట్రలు పటాపంచల్‌ అయ్యాయి..రెండున్నరేళ్లుగా తెలంగాణపై, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కుట్రలు చేస్తున్నారో స్పష్టమైంది..హైకోర్ట్‌ తీర్పు బీఆర్ఎస్‌ పార్టీకి పెద్ద ఊరట..అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్‌లాంటిదే.
రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది.నేతలపై క్యాడర్‌పై అనేక అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో హింసిస్తుంది..ఫోన్‌ ట్యాపింగ్ కేసు, ఈ కార్‌ రేస్‌ అంటూ అగ్ర నాయత్వాన్ని వేధిస్తుంది..సిట్‌లు, కమిషన్ల పేరుతో రాజకీయంగా వెండేటా రాజకీయాలు రేవంత్‌ రెడ్డి చేస్తున్నారు…మరోవైపు రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి కుట్రలు భగ్నం అవుతూ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటుంటే..బీఆర్ఎస్‌ పార్టీ అన్నీ కుట్రల నుంచి బయటపడుతు మళ్లీ ప్రజా మద్దతు పెంచుకుంటూ పూర్వవైభవం సంతరించుకుంటుంది..గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్‌ పార్టీకి వరుస విజయాలు  వస్తున్నాయి..రాజకీయాల్లో, న్యాయ స్థానాల్లో ప్రభుత్వంపై పై చేయి సాధిస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సహాన్ని పెంచుతుంది.
కేసీఆర్‌ చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు..ప్రజల సమస్యలను అడ్రస్‌ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను వివరించారు ..అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి సీనియర్ల వలసలు బీఆర్ఎస్‌లోకి పెరుగుతున్నాయి..ఇది బీఆర్ఎస్‌లో నయా జోష్‌ తీసుకువస్తుంది..అటు రెండున్నరేళ్లుగా బీఆర్ఎస్‌ పార్టీపై, కేసీఆర్‌పై హరీష్‌ రావు, కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల కుట్రలను న్యాయ స్థానం భగ్నం చేస్తుంది.నిజంగా ఇది బీఆర్ఎస్‌ పార్టీకి వేయి ఏనుగల బలం ఇస్తుంది.
ఒకవైపు కేసీఆర్‌ చాలా రోజుల తర్వాత బయటకు రావడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించడం..ఏ ఆరోపణలు, విచారణలతో రెండున్నరేళ్లుగా బీఆర్ఎస్‌ మానసికంగా కుంగిపోయిందో ఆ ఆరోపణలన్నీ న్యాయ స్థానాలు కొట్టేయడంతో బీఆర్ఎస్‌ టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోతుంది..జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హై కోర్ట్‌ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు రేవంత్‌ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్‌ బూస్ట్‌ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన పొలిటికల్ డ్రామాలకు ఇక తెర పడ్డట్లే..
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *