సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్‌, ‌తలసానికి భట్టి సవాల్‌

‌విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్‌,  ‌తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు  నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చేద్దాము ఈ మంత్రులకు ఉందా అని సవాల్‌ ‌విసిరారు. వంద మంది సెక్యూరిటీ పెట్టుకుని మాట్లాడటం కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు గుంజుకున్న ఇబ్రహీంపట్నం భూ నిర్వాసితుల వద్దకు వచ్చి మాట్లాడితే  ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. ప్రియాంక గాంధీ టూరిస్ట్ అం‌టూ మంత్రి కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌చేసిన కామెంట్స్ ‌పై ఫైర్‌ అయ్యారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములే పేదల దగ్గర ఉన్నాయని తెలిపారు. టిఆర్‌ఎస్‌ ఇచ్చిన భూములు ఎన్ని? మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మిగులు బడ్జెట్‌ ‌ధనిక రాష్ట్రాన్ని ఐదు లక్షలు కోట్ల రూపాయల అప్పులు తేవడం.. మద్యం అమ్మకాలు పెంచడమే కదా మీరు చేసిన అభివృద్ధి అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే వ్యక్తా? ఆయనకు ఆ అర్హత, జ్ఞానము లేదంటూ మండిపడ్డారు. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు?. మిగులు భూములు ఉన్నచోట కట్టాలని సూచించారు. ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నంలో పేదల నుంచి గుంజుకున్న ఐదు లక్షల కోట్ల విలువైన రూపాయల్లో నాలుగవంతు ఖర్చు చేసిన రాష్ట్రంలో పేదలందరికీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు వచ్చేవి అన్నారు. హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో పేదలకు పంపిణీ చేసిన భూముల వివరాలు, ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూముల వివరాల విలువను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి యేలిమేటి అమరేందర్‌ ‌రెడ్డి,  మేయర్‌ ‌చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, సీనియర్‌ ‌నాయకులు దేపా భాస్కర్‌ ‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ ‌ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page