భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 18: భూముల మార్కెట్ విలువలను త్వరలో పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు భూముల ధరల పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిట్‌చాట్‌లో భూముల ధరల పెంపు, రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు, రెవెన్యూ పాలసీ వంటి విషయాలపై స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొత్త పాలసీ తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతోందని, అది విడతలవారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదంటూ శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని మంత్రి వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను ’భూ-భారతి’ ద్వారా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్‌ను మ్యాప్‌తో అనుసంధానం చేస్తూ ఈ నెల 20 నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుందని చెప్పారు. మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ పాలేరు ప్రాంతంలో ప్రారంభం కానుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే చేపడతామన్నారు. వేసవి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. అసైన్డ్ భూములపై వచ్చిన ఫిర్యాదులను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే నాలుగు రకాల ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం విమర్శలు చేసినప్పుడు ఇతర మంత్రులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ప్రతిపక్షం ట్రాప్‌లో పడకుండా ఓపికగా సమాధానాలు ఇచ్చానన్నారు. ఇక బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై లిస్ట్ తయారవుతోందని, సరైన సమయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *