హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణకు కేసీఆర్ రానివ్వట్లేదని విమర్శించారు. ‘చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్ర భాగాన నిలిచింది. 20 లక్షల ఇల్లు కట్టించాం.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టింటినా.. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రెండు లక్షల కోట్ల రూపాయలు నగదును అందజేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వొచ్చాక..పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం కట్టించింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా 5 లక్షల మేరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. కేసీఆర్ ప్రజలను కలవడు. సచివాలయం రాకుండా ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లోనే పడుకుంటాడు. నరేంద్రమోదీ అధికారంలోకి వొచ్చాక బాంబు పేలుళ్లు, మత కలహాలు లేవని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి కేందప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.