మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం

ఇక బిఆర్‌ఎస్‌కు రెస్ట్‌ తప్పదని ఎద్దేవా
హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం రేణుకా చౌదరి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ వాళ్ళని చూస్తే జాలి వేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇక రెస్ట్‌ తీసుకోవా లని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ వాళ్ళకి రాని ఆలోచనలు తమకు వస్తున్నాయని కుళ్లుకొంటున్నారన్నారు.

ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్‌ నెరవేరు స్తుందని స్పష్టం చేశారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని.. దాని వల్ల సోమరి పోతులు అవ్వడం ఉండదని రేణుకాచౌదరి వెల్లడిరచారు. మహిళల ఆర్థికాభివృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. వారు చిన్నిచిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారికి కొంత వెసలుబాటు ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page