- అహింసా మూర్తికి… ఆత్మీయతతో…
- సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం
- ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్ మంత్రి హరీష్‌రావును కలిసి గాంధీ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని వినతిపత్రం ఇచ్చారు. వెంటనే సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సుకు అద్భుతమైన సుందరీకరణ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గాంధీ చౌక్‌లోగల గాంధీ పాత విగ్రహాన్ని తొలగించి నూతన క్యాంస్య విగ్రహ పునః ప్రతిష్ట చేయడాని రెడీ అయ్యింది. మహాద్బుతంగా మహాత్ముని విగ్రహం ఏర్పాటు కావడంతో గాంధీ అసోసియేషన్ సభ్యులు , అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన సుందరీకరణ అయిన గాంధీ విగ్రహాన్ని మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించనున్నారు.
గాంధీ చౌరస్తాలో చాయ్ త్రాగి ఎదిగిన నాయకులకు వేదిక సిద్ధిపేట గాంధీ చౌరస్తా సిద్ధిపేట గాంధీ చౌరస్తా అంటే తెలియని వారు ఉండరు. నాటి తరం నుండి నేటి తరం వరకు ఆ మహత్ముని జ్ఞాపకాలతో ఆ చౌరస్తా ఎన్నో కార్యక్రమాలకు వేదికైంది. గాంధీ చౌరస్తాలో చాయ్ త్రాగని, రాజకీయ చర్చలు చేయని నాయకులు లేరు. నాటి ఎడ్ల గురువారెడ్డి నుండి.. మదన్ మోహన్, సిఎం కేసీఆర్, నేటి మంత్రి హరీష్‌రావు వరకు ఎన్నో చరిత్రలకు వేదికైంది. సిఎం కేసీఆర్ గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం అహింసా మార్గంలో స్వరాష్ట్రాన్ని సాధించామనీ, దానికి సూచికగా మంత్రి హరీష్‌రావు మొక్కను నాటి స్ఫూర్తిని చాటుకున్నారు.
అలాంటి ఘన చరిత్ర ఉన్న గాంధీ చౌరస్తాకు మహా వైభవం… కొత్త వైభవం సంతరించుకుంది.. మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట అభివృద్ధిలో భాగంగా అన్ని జంక్షన్లను సుందరీకరణ చేశారు. గాంధీ అసోసియేషన్ గాంధీకి పూర్వ వైభవం..కొత్త వైభవం తేవాలనీ మంత్రిని కొరగానే వెంటనే నిలువెత్తు క్యాంస్య విగ్రహం ఏర్పాటు చేసి అద్భుతమైన సుందరీకరణ చేయాలని అహింసా మూర్తికి ఆత్మీయ నివాళ్లుమహాద్బుతంగా తయారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు గాంధీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.