స్వాతంత్య్రం సిద్దించి
అప్పుడే
వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా?
మారని మాటకొటుందని
ప్రశ్నిస్తోంది నన్ను
ఇన్నేళ్లు గడిచినా
నేనింకా అభివృద్ది చెందలేదెందుకని?
నా వొడిలో బతుకీడుస్తున్న
సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని
స్వేచ్ఛగా బతకలేక
ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని
బహుజనులకు అధికారం
అందనిద్రాక్షేనా
బలమొకరిది పెత్తనం ఇంకొకరిది
ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది
డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక
నీచరాజకీయాలంటూ ఘాటుగా సూటిగా ప్రశ్నిస్తోంది
బహూజనులే రాజులైతే
దేశం పురోగమిస్తుందని
అందరి బాగేకదా అభివృద్ధని
ఎదమాటునా భరతమాత భారంగా రోదిస్తూ….
త్రివర్ణ కేతనంలో మూడురంగులు సమానమైనట్టు సమభావన
సభజీవన సమైక్య భారతం నిర్మాణం కావాలని కలలుగంటూ ప్రశ్నిస్తోంది
స్వాతంత్య్రమొస్తే చాలదు
స్వేచ్ఛ ఒకటే కాదిక్కడ
సమానత్వంతో
వ్యక్తులందరు శక్తులుగా ఎదగాలని
అధికారం అందరికీ చేరువకావాలనీ
అభివృద్ధికి అందరూ అర్హులవ్వాలని
తనను అభివృద్ధి చెందిన దేశమంటూ
అగ్రపథాన నిలపాలని ప్రశ్నిస్తోంది
ఆశతో నా భరతమాత
– సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు, 9010480557.