భరతమాత ప్రశ్నిస్తోంది
స్వాతంత్య్రం సిద్దించి అప్పుడే వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా? మారని మాటకొటుందని ప్రశ్నిస్తోంది నన్ను ఇన్నేళ్లు గడిచినా నేనింకా అభివృద్ది చెందలేదెందుకని? నా వొడిలో బతుకీడుస్తున్న సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని స్వేచ్ఛగా బతకలేక ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని బహుజనులకు అధికారం అందనిద్రాక్షేనా బలమొకరిది పెత్తనం ఇంకొకరిది ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక నీచరాజకీయాలంటూ…