బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల అధికంగా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 1 నుంచి లీటరు పాల ధర రూ. 3 పెరుగుతోందని, కిలో కాఫీ పొడి ధర రూ. 100 వరకు పెరిగిందని ఈ నేపథ్యంలో టీ, కాఫీ ధరలు కూడా రూ.2 నుంచి రూ.3 వరకు పెరిగే అవకాశం ఉం దన్నారు. టిఫిన్ల ధరలు రూ. 5 మేరకు,. భోజనం ధరలు రూ. 10 మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సమయంలో రెండేళ్లపాటు బాగా దెబ్బతిన్న హోటల్ పరిశ్రమ ఇపుడిపుడే కోలుకుంటున్న తరుణంలో ధరాఘా తం బాగా తగిలిందని, పెరిగిన ధరలతో హోటళ్ల నిర్వహణ చాలాకష్టంగా మారిందని ప్రకటనలో తెలిపారు.