– తమిళనాడు ప్రాధాన్యం తగ్గింపు
– అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నాం
– తమిళనాట ఎన్నికల ప్రచార సభలో రాహుల్
చెన్నై, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ఆయన మాట్లాడుతూ ఈ డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, అందుకే దానిని అడ్డుకున్నామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో శనివారం జరిగిన ర్యాలీలో రాహుల్ ం ప్రసంగించారు. ’చాలా ఏళ్లుగా తమిళనాడు ప్రజలతో నాకు అనుబంధం ఉంది.. నేను తమిళనాడులో పుట్టలేదు.. నా కుటుంబం కూడా తమిళనాడు నుంచి వచ్చినది కాదు.. అయినప్పటికీ ఇది నా సొంతిల్లులా అనిపిస్తుంది’ అని తమిళనాడుతో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. తమిళ భాష, సంస్క్నతిపై కొన్నేళ్లుగా ఆరఎసఎస్, బీజేపీ దాడికి ప్రయత్నిస్తున్నాయంటూ వీళ్లకెంత ధైర్యం అని నాకు అపిస్తుంటుంది అని రాహుల్ అన్నారు. పార్లమెంటులో శుక్రవారం నాటి పరిణామాలపై మాట్లాడుతూ కొత్త బిల్లు పేరుతో వాళ్లు పార్లమెంటు ముందుకు వచ్చారని, దానిని మహిళా బిల్లు అని చెబుతున్నారని, అయితే మహిళా బిల్లును 2023లోనే ఆమోదించారని తెలిపారు. బిల్లు వెనుక అసలు ఉద్దేశం నియోజకవర్గాల పునర్విభజనేనని అన్నారు. పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించడం, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను బలహీనపరచడం బిల్లు ఉద్దేశమని, అందువల్లే ఆ బిల్లును తాము ఓడించామని చెప్పారు. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి మాట్లాడే అవకాశం, భాష, సంప్రదాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకునే వీలుండాలని అన్నారు. బీజేపీ పాలనా విధానం ఇందుకు భిన్నంగా ఉందని, ప్రధానమంత్రి ఒకే దేశం, ఒకే నేత, ఒకే భాష, ఒకే ప్రజ అంటూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం గుత్తాధిపత్యాన్ని తమ కూటమి అడ్డుకుంటుందని చెప్పారు. దిల్లీ నుంచి తమిళనాడును శాసించాలని బీజేపీ, ఆరఎసఎస్ అనుకుంటున్నాయని రాహుల్ విమర్శించారు. అయితే ఇందుకు తాము ఎంతమాత్రం అనుమతించేది లేదన్నారు. తమిళనాడు తన భవిష్యత్తును తానే నిర్దేశించుకుంటుందని, తమిళ సంస్క్నతి, హక్కులు, భాషా పరిరక్షణలో తాము ప్రజలకు బాసటగా ఉంటామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





