ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

  • ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి
  • భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..?
  • నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
  • వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం
  • భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన

సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి సేవ చేయాలి మనం. పేర్లు వేరు..ఒకరు ఆశా, ఒకరు ఏఎన్‌ఏం, ఒకరు ఏంపీ, ఒకరు మంత్రి కావొచ్చు. నా జీతం 2 లక్షలు. స్టాఫ్‌ ‌నర్సుగా నీ జీతం 77 వేలు. నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా…? నార్మల్‌ ‌డెలివరీ చేయడానికి స్టాఫ్‌ ‌నర్సు చాలు. భద్రాచలంలో వైద్యుడు లేకుండానే ఒక్కరే స్టాఫ్‌ ‌నర్సు రోజుకు 20 డెలివరీలు చేస్తున్నారు. మనం కూడా నార్మల్‌ ‌డెలివరీలు చేయాలి’ ఇలా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్యాధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. గురువారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణ పనులకు మెదక్‌ ఏం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ మేరకు అక్కడి వైద్య అధికారులు, సిబ్బందితో మాటామంతి కలిపి అవసరం లేకున్నా…ఆపరేషన్‌ ‌చేయడం వొద్దు. నార్మల్‌ ‌డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ…మీ పీహెచ్‌సీలో గర్భిణీలు ఎంతమంది.? వీరిలో ప్రభుత్వ, ప్రయివేటుకు ఎంతమంది వెళ్తున్నారు.? నార్మల్‌, ‌సెక్షన్‌ ఎం‌త.? ఆరా తీస్తే …ఆశా : 35 మంది గర్భిణీలు. 1 మాత్రమే ప్రయివేటులో డెలివరీ అయ్యారని తెలిపింది.

ఎంత కడుపు కోత అవుతుందో..మీకు తెలియడం లేదు, మన ప్రజల్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రజలతో మమేకంగా ఉండాల్సిన వాళ్ళం మనమే కదా. మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. కొరోనా సమయంలో చాలా కష్టపడి పని చేశారని ఓ వైపు అభినందించి, మరో వైపు బీపీ కంట్రోల్‌ ‌చేయకపోతే కిడ్నీలు పాడవుతున్నాయని, షుగర్‌ ‌మందులు, బీపీ మందులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పెద్ద ఆపరేషన్‌ ‌చేసి, గర్భసంచి తీసే వ్యాపారం చేయొద్దని, దాన్ని కూడా బంద్‌ ‌చేయించాలని, అర్థమయ్యేలా చెప్పాల్సిన వాళ్ళు మీరే కాబట్టి సాటి మహిళా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి, మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.పీహెచ్‌సీ వైద్య అధికార సిబ్బంది వారీగా అక్కడికక్కడే సమీక్షిస్తూ.. ముగ్గురు ఉంటే.. మీ ఓపీ 21 ఉండటమేంటనీ ఆరా తీశారు.

ఈ లెక్కన మీ విధులు ఏ పాటి నిర్వర్తిస్తున్నారో.. అర్థం అవుతున్నదని, రాత్రి పూట ఎవరైనా ఉంటున్నారా..? ముగ్గురు స్టాఫ్‌ ‌నర్సులు ఉన్నారని రాత్రిపూట ఎవరూ ఉండటం లేదనే ఫిర్యాదు. పాముకాటు, తేలు కాటు మందులు ఉన్నాయా..? సూదులు ఉన్నాయా..? కుక్కకాటుకు ఎవరైనా వొస్తే వెంటనే ట్రీట్మెంట్‌ అం‌దిస్తున్నారా.. ఫ్రిజ్‌లో మందులు ఉన్నాయా.. చూడమంటరా..? అని ఆరా తీస్తూ..పేషేంట్లు తక్కువ..ఉద్యోగులెక్కువ..21 మంది స్టాఫ్‌కు 21 మంది పేషేంట్లు ఉంటారా..అంటూ సుతిమెత్తగా మందలించారు. గత నెలలో ముగ్గురు స్టాఫ్‌ ‌నర్సులు ఒకే కాన్పు చేయడమేంటనీ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *