దుమ్ముగూడెం నీటి నిల్వ పెంపునకు చర్యలు

– మూడు జిల్లాల అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించాలి
– సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించండి
– నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలి
– వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల 

భద్రాచలం/ అశ్వాపురం, ప్రజాతంత్ర, అక్టోబ ర్ 19: దుమ్ముగూడెం ఆనకట్ట నీటి నిల్వ పెం పునకు తక్షణమే చర్యలు చేపట్టాలని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను మంత్రి తుమ్మల సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి పరిశీలించారు. రానున్న వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆనకట్ట వద్ద నీటి నిల్వను పెంచేందుకు చేప ట్టాల్సిన చర్యలను అధికారులతో కలిసి సమీక్షిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దు మ్ముగూడెం ఆనకట్ట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో నీటి నిల్వకు అనుకూలమైన పరిస్థితులు పరిమి తంగా ఉన్నందున నీటిని నిల్వ చేసుకోవడం అత్యంత కీలకమని అన్నారు. సూపర్ ఎల్సినో ప్రభావంతో వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయం గా పెరిగే అవకాశం ఉందని, దీంతో విద్యుత్ వినియోగం పెరిగి కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ముంద స్తు చర్యలు చేపడుతోందన్నారు.

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద మీటరు ఎత్తు వరకు ఇసుక బస్తాలను వేసి నీటిని నిల్వ చేసు కోవాలని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించాలన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు అనుమతులు, న్యాయప రమైన అడ్డంకుల కారణంగా ఐదేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్టు కు అనుమతుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపు తోందని అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని పంటల సాగుపై రైతులు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పంటల సాగుకు ఎకరానికి లక్ష నుంచి రెండు, మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమ వుతున్న నేపథ్యంలో పంట చేతికొచ్చే సమ యంలో నీరు, విద్యుత్, భూగర్భ జలాల కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్ర మా దం ఉందన్నారు. అందువల్ల సాగుకు ముందే నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల పరిస్థితులను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *