14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక

– ఎల్నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత
– రేషన్ ద్వారా గోధుమ పిండి సహా నిత్యావసరాల పంపిణీపై పరిశీలన
– మంత్రి ఉత్తమ్ వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 19: ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరు గుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించేందుకు 14 నెలల వరకు అవస రాలను తీర్చేలా ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయా లని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోమవా రం సచివాలయంలోని తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాబోయే వ్యవసాయ సీజన్లలో వర్షపాతం. తగ్గినా రేషన్ సరఫరాలకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం ని ల్వల నిర్వహణకు ముందుగానే కార్యాచ రణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న వరి పంట దిగుబడిపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు కలిపి నెలకు సుమారు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఈ లెక్కన వార్షిక అవసరం 28.56 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు. 2026 అక్టోబర్ 16 నాటికి రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలపై పడే భారాన్ని తగ్గించేందుకు రేషన్ వ్యవస్థ ద్వారా గోధుమ పిండితోపాటు ఎంపిక చేసిన నిత్యావసర వస్తువులను అందించే అవకాశాన్ని మంత్రి పరిశీలించారు..


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *