– నవంబర్‌లోగా ఈ పని పూర్తికావాలి
– లేకపోతే కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద ధర్నా
– మేడిగడ్డను చూపి రైతులకు నష్టం చేయొద్దు
– ప్రభుత్వానికి పరిష్కారాలు కూడా సూచిస్తున్నాం
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కాళేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా బాధలో ఉన్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద నదులు గోదాకృష్ణ నీళ్లను సరిగా వాడుకుంటే మనకు ఈ పరిస్థితే ఉండదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద ప్రాణహిత ప్రవాహాన్ని సోమవారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ మనం తెలంగాణ కోసం పిడికిలి ఎత్తి ఉద్యమం చేసింది కూడా మా నీళ్లు మాకు కావాలనే.. కానీ తెలంగాణ వచ్చాక మన నీటిని సంపూర్థంగా వాడుకున్నామా అంటే వాడుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాసలు సరైన టైమ్ కి రావటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. బీఆర్ఎస్ టైమ్ లో కృష్ణా నది ప్రాజెక్ట్ ల పై కొంత పనులు చేసి 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. ఉత్తర తెలం గాణలో ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు కు నీళ్లు ఇస్తూ 37 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేసే ప్రయత్నం చేశారు.మొత్తంగా లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి స్థిరీకరణ మాత్రమే చేశారు. కాళేశ్వరంలో కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఈ విషయం మనం చెబితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మనపై దాడి చేస్తారు. కానీ నిజాలు మారవు. వాస్తవాలు కచ్చితంగా కఠినంగానే ఉంటాయి. ఇక కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఘోరంగా పరి స్థితి తయారైంది.రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. అడిగితే బకాయిలు చెల్లించామని చెబుతు న్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, దళిత బంధు లాంటి బకాయిలు చెల్లించకుండా ఇవే ఎందుకు చెల్లించినట్టు? కరెంట్, నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉండి ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగకుండా చేస్తాం. మే మిచ్చిన సూచనలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇం జనీర్లు వాటిని సరిచేసుకో మంటే చేసుకోవటానికి సిద్ధం.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిచేస్తే సరే. లేదంటే మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా ఈ ప్రతిపాదనలను పూర్తి చేస్తాం. ఎక్కడ పొలాలను చూసినా సరే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వానికి నీళ్లు ఎలా ఇవ్వొచ్చొ మార్గదర్శనం చేసేందుకు మేము ఇక్కడ వరకు వచ్చాం. ఈ ముఖ్య మంత్రి రైతులకు సంబంధించి సంఘాల్లో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. రైతు సమస్యలకు సంబంధించిన సంఘాల్లో రాజకీయాలు వద్దని సూచిస్తున్నా, కాళేశ్వరం కోసం దాదాపు 93 వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చా రు. కాళేశ్వరం నీళ్లను ఇచ్చేందుకు కాలువలు తవ్వకపోవటంతో కొత్త గా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వటం సాధ్యం కావటం లేదు. ఆ కాలువలను పూర్తి చేయాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎలాగు అంత ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటికే ఎల్లంపల్లి సహా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను తాగునీటి కోసం అని స్టోర్ చేశారు. రానున్న పది నెలలు మనం భయంకరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 21 వేల చెరువులు ఎండిపోయి ముదిరాజ్, బెస్త సోదరులకు ఈ ఏడాది పనిలేని పరిస్థితి వచ్చింది. ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము చేస్తున్న మంచి సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





